శ్రీ విద్యా సాధనలో నిత్యా దేవతల పూజ ఎంతైనా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి పదహారు (16) నిత్యా దేవతల నిత్యార్చన పామర జనులకు కూడా అనేక సమస్యలను తీర్చి, దివ్యౌషధంగా పని చేస్తుంది.
ఈ పూజ చేయడము చాలా సులభము. శుక్ల పక్ష పాడ్యమి నాడు మొదలు పెట్టి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న..మొదలైన పదహారుమంది నిత్యలను ఏ రోజు నిత్యా దేవతను ఆ రోజు అర్చనం చేయాలి. కృష్ణ పక్ష పాడ్యమి నాడు మరలా కామేశ్వరితో ప్రారంభించి వరుసగా చేస్తూ, చివరగా అమావాస్య నాడు అమావాస్య నాడు మహా నిత్య అర్చనం చేయాలి. ఇలా ఎవరైతే అర్చన చేస్తారో, వారికి ఇహ పర భోగాలకు లోటు లేదని శాస్త్రం చెబుతున్నది.
Click to open PDF / Audio