శ్రీ విద్యా విధానంలో అతి రహస్య పూజలు అనేకం ఉన్నాయి. వాటిలో మనలో ఉన్న సప్త ధాతువుల రక్ష గావించి, వాటిలోని దోషాలను నివృత్తి చేసి, మనలను ఉపాసన వైపు తదేక దీక్షతో మరల్చటానికి ఉపయోగపడే పూజ పేరు షట్చక్ర పూజ. ఇందులో మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఆరు చక్రాలలో ఆ దేవతా శక్తులను యథా శక్తి అంతర్బహిర్యాగం (లోపల, బయట అర్చన) చేయడం వల్ల సకల ధాతువుల పుష్టి కలిగి, సదా ఆరోగ్యంతో విలసిల్లుతారు. ఈ పూజను ప్రతి రోజూ, లేదా, పంచమి, దశమి, పౌర్ణమి వంటి ముఖ్యమైన తిథులలోను, పండుగలలోను పూర్తిగా చేసుకొనవచ్చును. శక్తి సమయము లేని వారు ఏ ధాతువు యొక్క రక్షణ కోరుకున్నారో, ఆ ధాతువునకు సంబంధించిన చక్ర పూజను మాత్రము చేసుకోవచ్చును. మీ సౌకర్యము కొరకు ఏ ధాతువు ఏ చక్రానికి సంబంధించినదో వివరములు దిగువనివ్వబడినవి.
Click to open PDF / Audio