Donate

Telugu

Sri Guru Karunamaya has been practising and teaching Srividya for the last 40 years.

శ్రీవిద్య సాధనా తరగతులు

శ్రీవిద్యా జ్ఞానపీఠం ఆధ్వర్యంలో తెలుగులో ఆన్లైన్ ద్వారా శ్రీ గురు కరుణామయ గారి వద్ద శాస్త్ర ప్రామాణికమైన శ్రీవిద్య అభ్యసించి మీలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందండి.

శ్రీ గురు కరుణామయ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వికీపీడియా పేజీని చూడండి

గురు కరుణామయ వికీపీడియా

శ్రీ గురు కరుణామయ గారు గత 40 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా పవిత్ర వేద శాస్త్రాన్ని వ్యాప్తి చేస్తు, శాస్త్ర ప్రామాణికమైన శ్రీవిద్యను బోధిస్తున్నారు.

శ్రీవిద్య వేల సంవత్సరాల క్రితం వేద కాలంలో ఉద్భవించిన పరదేవతా రహస్య జ్ఞానం. శ్రీవిద్య యొక్క సూత్రాలు ఆధునిక కాలానికి చాలా సందర్భోచితమైనవి.

శ్రీవిద్యా సంప్రదాయం

గురు కరుణామయ గారు శ్రీవిద్యలోని అత్యంత ప్రామాణికమైన గ్రంథాలలో ఒకటైన పరశురామ కల్పసూత్ర లో పేర్కొన్న మిశ్రమ సంప్రదాయం ప్రకారం శ్రీవిద్యను బోధిస్తారు.

శ్రీ మహా విష్ణువు యొక్క ఐదవ అవతారమైన పరశురాముడు గురు దత్తాత్రేయ శిష్యుడు. పరశురాముడు “కల్పసూత్ర రచయిత” అని చెప్పబడింది.

ఇది మాతృ దేవత లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన కల్పం. శాస్త్ర పరమైన ఆచారాలను నియంత్రించే నియమాలను నిర్దేశించే గ్రంథమునే కల్పము అని చెబుతారు.

ఆత్మోద్ధరణ – వ్యక్తిత్వ వికాసం

ప్రతి వ్యక్తిలో అపారమైన శక్తి ఉంటుంది. శ్రీవిద్యా ఉపాసన పరాశక్తి యొక్క సర్వవ్యాప్త శక్తిని గ్రహించడంలో మీకు సహాయపడుతుంది.

శ్రీవిద్యా సాధన ద్వారా నిజమైన ఆత్మశక్తిని అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితం లో క్రమశిక్షణ ఏర్పడి బాధలు మరియు దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది.

ఈ ఉపాసన ద్వారా, మీకు ఏ జీవితం అమ్మ అనుగ్రహించిందో దానిలోనే ఆనందాన్ని పొందుతూ కర్మ క్షయం గావించుకుంటూ, మీకూ మరియు సర్వవ్యాప్త విశ్వశక్తికి మధ్య ఎటువంటి భేదం లేదని గ్రహిస్తారు.

శ్రీ విద్య సాధనా తరగతులకు సుస్వాగతం!!!

శ్రీ మాత్రే నమః

ప్రతినెల శ్రీవిద్య ప్రాధమిక తరగతులు 3 రోజులు ఇంగ్లీష్ మరియు తెలుగులో నిర్వహిస్తాము. ఈ తరగతులను Online (Zoom Video) ద్వారా నిర్వహించనున్నాము.

ఈ తరగతులలో మీరు, జీవన నైపుణ్యములు, సంప్రదాయబద్ధము మరియు ప్రామాణికమైన ఆచారములు, మరియు మంత్రములను పూజ్య గురుదేవులు శ్రీ గురు కరుణామయ గారి వద్ద నుండి నేరుగా నేర్చుకుంటారు.

ఈ తరగతులకు మీరు ఆన్ లైన్ లో హాజరు కాగలుగుతారు. (ఈ మూడు రోజుల తరగతులు ముగిసాక, నేర్చుకొన్న విషయములను తిరిగి మననము చేసుకొనుటకు ఈ తరగతుల యొక్క వీడియో రికార్డింగ్ లింక్ మీకు 15 రోజుల పాటు ఇవ్వబడును. )

తరగతుల నిర్వహణా వివరములు:
 • • 15 సెప్టెంబర్ 2023 శుక్రవారం: 5PM TO 9PM IST
 • • 16 సెప్టెంబర్ 2023 శనివారం: 5PM TO 9PM IST
 • • 17 సెప్టెంబర్ 2023 ఆదివారము: 5PM TO 9PM IST
ఇందులో నేర్పబడే కొన్ని విషయాలు:
 • 1. శ్రీవిద్య ఉపాసనా సూత్రములు
 • 2. గణపతి, బాల మరియు వాగ్వాదినీ మంత్ర దీక్ష
 • 3. మంత్ర జపమును ఉత్కృష్టముగా చేయుటకు మెళకువలు మరియు దివ్య శక్తి ని పొందే విధముగా ధ్యానము చేయు మార్గములు
 • 4. శ్రీవిద్యా దేవతలైన గణపతి, బాల, రాజశ్యామల, వారాహి మరియు లలితల గురించి వివరణ
 • 5. తెలివితేటలను పెంచుటకు,వాక్ నైపుణ్యం అభివృద్ధి పరచుటకు, క్రోధము మరియు వత్తిడిని తగ్గించు కొనుటకు ఉపయోగ పడే న్యాసములు
 • 6. వ్యావహారిక జీవితము లోను మరియు ఆధ్యాత్మిక జీవితము లోను మీకు ఎదురయ్యే సాధారణమైన సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారములు
 • 7. శ్రీ యంత్రము యొక్క ఏర్పాటు, అందలి దేవతల యొక్క స్థానములు మరియు వారిని పూజించుట వలన కలుగు ఫలితములు
 • 8. శ్రీ యంత్రమును అత్యంత శక్తివంతముగా పూజించు విధానము
 • 9. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక జీవితములో ఆటంకములను అధికమించి పురోగతిని సాధించుటకు గణపతి తర్పణము మరియు గణపతి హోమము చేయు విధానము

ఈ తరగతులకు హాజరైన వారందరికీ స్టడీ మెటీరియల్స్ అందచేయబడతాయి .

తీవ్ర సాధన చేయుటకు తత్పరులైన వారు, మరియు ఇప్పటి వరకు గురుమంత్రోపదేశం అవ్వని వారి కొరకు ఈ కోర్సు ప్రత్యేకముగా రూపకల్పన చేయబడింది. (శిష్యులు వివిధ సాధనా మార్గముల మధ్య గందరగోళమునకు గురి అయ్యే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ నియమం ఏర్పరచబడింది.)

పైన చెప్పబడిన ప్రమాణములను మీరు కలిగిఉంటే, మూడు రోజులకు స్వల్ప రుసుము చెల్లించి ఈ తరగతులకు హాజరు కాగలరు.

నాలుగు సంవత్సరముల క్రితం వరకు ఈ తరగతులకు మేము రుసుమును స్వీ కరించలేదు. కానీ శ్రీవిద్యా జ్ఞాన పీఠం స్థాపించిన తరువాత, సాధనా తరగతులకు చెల్లించబడిన రుసుమును, పీఠములో జరుప బడే పూజాదికములు, హోమములు నిర్వర్తించుటకు అవసరమయ్యే ద్రవ్యములను సేకరించుటకు ఉపయోగించుచున్నాము.

నిత్యమూ, బ్రహ్మముహూర్త కాలము 3.30 నుండి రాత్రి 9.౩౦ వరకు వివిధ పూజలు మరియు హోమములు పీఠము లో జరుపబడతాయని గమనించ గలరు.

శ్రీ మాత్రే నమ

శ్రీవిద్య తరగతుల్లో చేరడానికి నమోదు చేసుకోండి.

Register Now

సందేహాలు, సమాధానములు

ఇబ్బంది లేదు. భక్తి, శ్రద్ధ ఉన్న వారు ఎవరైనా శ్రీ విద్య నేర్చుకోవచ్చును. ఆహారానికి సంబంధించిన నిబంధనలు ఏమీ లేవు. అయితే, చక్కని శ్రీవిద్య అభ్యాసానికి మాంసాహారం వంటి తామసిక ఆహారము అడ్డు వస్తుంది.

శ్రద్ధా భక్తులతో, రోజుకు కనీసం 2 గంటల సమయం వెచ్చించి సాధన చేయగలగటమే ముఖ్యమైన అర్హత. అయితే, శ్రీవిద్యలో గురువు ఒక్కరే ఉండాలి. అనగా మీకు మంత్ర దీక్ష ఏ గురువు ఇచ్చారో, వారి దగ్గర మాత్రమే మొత్తం విద్య నేర్చుకోవాలి. ఇక్కడ ఇవ్వబడే మంత్రాలకు అనురూపమైన మంత్రాలు ఇంకెవరన్నా ఇచ్చినా కూడా, గురువును మార్చుకో కూడదు. తద్వారా, వివిధ గరువులు చెప్పే వివిధ మార్గాల కారణంగా ఏర్పడే సందేహాస్పద పరిస్థితి నుండి మనలను మనం కాపాడుకోవచ్చును.

ప్రారంభంలో ఉపాసన చేయాలంటే శ్రీ చక్రం ఉండాలని నియమం ఏమీ లేదు. తరువాతి కాలంలో నవావరణ అర్చన చేసేటప్పుడు శ్రీ చక్రం కావలసి వస్తుంది.

లేదు. మాడ్యూల్ 1 మరియు 2 క్లాసులు మీలోని భయాన్ని పోగొట్టి, ఉపాసన లో మీకు కలిగే సందేహాలకు సమాధానాలు ఇస్తూ, విశ్వమాత అయిన అమ్మతో మిమ్ములను అనుసంధానం అయ్యేట్లుగా చేయడం మాత్రమే ఉంటుంది. 2 లేదా 3 నెలల ఉపాసన చేసిన తరువాత, అన్ని విధములుగా సరియైన ఒక చక్కని శ్రీ యంత్రం ,సరియైన ధరలో మా ద్వారా పొందే విధానం గురించి చెప్పబడుతుంది. (మేము శ్రీయంత్రం తయారు చేయటం గానీ, అమ్మటం గానీ చెయ్యము.)

క్లాసులు ఆన్ లైన్ లోనే జరుగుతాయి కనుక, ఈ కారణం వలన మీరు క్లాసులు హాజరు కావడం మార్చుకోవలసిన అవసరం ఏమీ లేదు. కానీ దీక్ష మాత్రం స్నానం అయిన తరువాత తీసుకోవచ్చును.

ఫీజు కట్టిన తరువాత, సరైన కారణం వివరించి, మీరు మాడ్యూల్ 1 మరియు 2 క్లాసులు ఎన్ని సార్లైనా హాజరు కావచ్చును.

మాడ్యూల్ 1 మరియు 2 క్లాసులలో మొదటి రోజు క్లాసుకు అందరూ తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుంది. 3 రోజుల క్లాసులు క్రమం తప్పకుండా హాజరు కావలసి ఉన్నప్పటికీ, ఆన్ లైన్ సమస్యలు లేదా వేరే సమస్యల కారణంగా మీరు మిగిలిన రెండు రోజుల క్లాసులు హాజరు కాలేకపోతే, ఈ మూడు రోజుల క్లాసుల వీడియోలు మీకు షేర్ చేయబడతాయి. 15 రోజులలోపు మీరు ఈ వీడియోలను ఎప్పుడైనా ఎన్ని సార్లైనా ఈ వీడియోలను చూస్తూ అభ్యాసం చేసుకోవచ్చును.

అద్వైతము వైపు ప్రయాణించడానికి ముందు ద్వైతము ద్వారా కొన్ని రోజులు ఉపాసన చేయవలసి ఉంటుంది. మా గురువు, పరమ గురువులు కూడా ఈ మార్గం ద్వారానే పూజలు, హోమాలు చేస్తూ చివరికి అమ్మతో అనుసంధానం అయ్యే స్థితికి వచ్చిన వారే. పూజ కోసం మీరు వెచ్చించే సమయం (ప్రారంభంలో) రోజుకు ఒక గంట మాత్రమే.

నేర్చుకుంటున్న విషయం పైన శ్రద్ధ మరియు ఆసక్తులతో నేర్చుకునే వారికి ఏ నిబంధనలూ లేవు. అయినప్పటికీ, యువ ప్రాయంలో నేర్చుకోవటం వలన ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉన్నది.

మీరు ఫీజు చెల్లించి, ఆ వివరాలను టెలిగ్రామ్ యాప్ (telegram app) లేదా వాట్సాప్ (whats app) మాకు పంపగానే మీ పేరు రిజిస్టర్ అయిన గ్రూప్ లో చేర్చబడుతుంది. (study material) మరియు ఇతర వివరాలు, క్లాసుకు రెండు రోజుల ముందర గ్రూప్ లో అందజేయపడతాయి.

జూమ్ క్లాస్ ద్వారా బోధన జరుగుతుంది. దీనిలో చివర జరిగే సందేహాలు–సమాధానాలు లో మీరు అడిగి, మీ సందేహ నివృత్తి చేసుకొనవచ్చును.

మంత్రము గ్రూప్ లో వ్రాసి పంపబడుతుంది. మీరు దానిని ముందుగా కంఠస్తం చేయవలసి ఉంటుంది. తరువాత జూమ్ క్లాస్ లో మంత్ర దీక్ష ఒక్కొక్కరికీ విడి విడిగా ఇవ్వబడుతుంది.

“ఉప” అనగా దగ్గర, “ఆసన” అనగా ఉండుట. “ఉపాసన” అనగా భగవంతుని దగ్గరగా ఉండుట అని అర్థము. సర్వ శక్తిమంతుడైన పరమేశ్వరుడు లేదా అమ్మతో అనుసంధానం అవటానికి మనం చేసే ధ్యానము లేదా జపములను సూచించే పదమే ఉపాసన.

అమ్మకు దగ్గరగా ఉండటానికి మనకు సహాయపడేదే ఉపాసన. ఉపాసన వలన మనలో ఎంతో సగుణాత్మకైన మార్పులు వస్తాయి. పరివారం లోని ఇతర సభ్యులతో, మిత్రులతో, సహాధ్యాయులతో అందరితో సరైన సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవటాన్ని, ఈ ఉపాసన ఇనుమడింపజేస్తుంది. ప్రపంచాన్ని(మన చుట్టూ ఉన్న జీవులను, పరిస్థితులను) ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించటానికి సహాయపడుతుంది. మనలో స్థిరత్వాన్ని అభివృద్ధి పరచి, తద్వారా, ఐహిక జగత్తునందు మరియు భక్తి తత్వము పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఉపాసనను కొనసాగిస్తూ, ఇంకా దృఢతరం చేస్తే, వ్యతిరేక లక్షణాలను అధిగమించి, మన మీద మనం నియంత్రణ చేసుకుంటూ, ప్రతి ఒకదానినీ ఆనందంగా ఆహ్లాదంగా చూడగలగటం అలవాటు అవుతుంది.

SVLC అనగా Sri Vidya Learning Center. అనగా శ్రీ విద్యా జ్ఞాన పీఠము.

 • మనస్ఫూర్తిగా అభ్యాసం చేయాలనుకునే వారికి మంత్ర దీక్షల ద్వారా శ్రీవిద్య ప్రారంభింపజేయడం.
 • నిత్యజీవితంలో ఎదురయ్యే దైనందిన సమస్యలను, సరైన ఆధ్యాత్మిక తరుణోపాయాలతో ఎదుర్కొనడానికి కావలసిన జ్ఞానమును పెంపొందింపజేయడం.
 • అవసరమైన వారికి, శ్రీ యంత్రము గురించి వివరిస్తూ, అమ్మను పూజించే పద్ధతులను తెలియజేయడం.
 • శ్రీ సూక్తము వంటి వైదిక సూక్తముల ఉచ్ఛారణ స్పష్టత గురించి బోధించడం.
 • చక్ర ధ్యానము ద్వారా చక్రములను ఉత్తేజ పరచుకొంటూ, నాడీ శుద్ధి చేసుకోవడాన్ని గురించి బోధించడం.
 • వాగ్దేవతా న్యాసము (మన శరీరంలో ఉండే 8 ప్రసార మాధ్యమ కేంద్రాలు) ద్వారా, ప్రతిభావంతమైన వాక్శక్తిని పెంపొందించుకునే మార్గం గురించి బోధించడం.
 • 99 కళలు లేదా 99 శక్తులను మేల్కొలుపుతూ, శ్రీ యంత్రానికి నిత్య పూజ చేయడం గురించి బోధించడం.
 • ప్రకృతి శక్తులలో సమతౌల్యం తెప్పిస్తూ, విశ్వ శాంతి కొరకు ప్రతి రోజూ హోమములు నిర్వహించడం.
 • అవసరమైన వారికి, వారిలోని శక్తులను చైతన్యవంతం చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి, ఏకాంతత కలిగించే ఏర్పాటు చేయడం.
 • జీవన విధానాన్ని సరి చేసుకునేందుకు అవసరమైన మార్గ దర్శనం చేయడం, శ్రీ విద్య గురించి వివరించే వర్క్ షాప్ లు నిర్వహించడం, యోగా, ధ్యానము నేర్పించడం.
 • డిప్రెషన్, వ్యతిరేక భావనలు, చెడు అలవాటులు ఉన్నవారిని సరిచేసి, సక్రమ మార్గములో నడిచేందుకు కావలసిన పద్ధతులు, ఉపాయాలను గురించి తెలియజేయడం.
 • యువతరానికి ఒక బాధ్యతాయుతమైన, లక్ష్య సిద్ధి కోసం ఉపయోగపడే జీవనం ఎలా గడపాలి అనే విషయం గురించి, యువతరానికి వివరించడం.

శ్రీ విద్య అనగా ఒక జీవన మార్గము. సంతోషకరమైన జీవనము జీవించడానికి కావలసిన మార్గమును సుగమం చేస్తూ, చుట్టూ ఉన్నవారితో సరిగా వ్యవహరించే పద్ధతిని నేర్పేదే శ్రీ విద్య. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడాన్ని నేర్పేదే శ్రీ విద్య. సంపూర్ణమైన శక్తితో, జాగరూకతతో, అన్నిటినీ మించి, చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో సంతోషవంతంగా జీవించడాన్ని, శ్రీ విద్య మనకు నేర్పుతుంది.

ప్రతి లెవెల్ లో, మన శరీరం లోని చక్రములను ఉత్తేజపరచేందుకు మంత్ర దీక్ష ఇవ్వ బడుతుంది. ఆ మంత్రము యొక్క ఉపాసన మనం చేయవలసి ఉంటుంది. ఉపాసన చేయటానికి రోజుకు కనీసం రెండు గంటల సమయం వెచ్చించ వలసి ఉంటుంది. ఎంత ఎక్కువ సమయం వెచ్చించగలమో అంత త్వరగా తరువాతి లెవెల్ కు చేరే అవకాశం లభిస్తుంది.

 • ఈ మొత్తం కోర్సులో, శ్రీ విద్యలో ఉన్న వివిధ దేవతల ( గణపతి, బాల, రాజ శ్యామల, వారాహి మరియు లలితా పరమేశ్వరి ) మంత్రములు నేర్పబడతాయి.
 • ఆ యా మంత్రోపాసన చేయడం గురించి వివరించబడుతుంది.
 • ఆ యా దేవతలు శ్రీ చక్రంలో ఎక్కడ ఉంటారో వివరంగా తెలియజేయబడుతుంది.
 • శ్రీ చక్ర లఘు నిత్య పూజా విధానము గురించి వివరించబడుతుంది.
 • లఘు హోమ విధానములు నేర్పబడతాయి.
 • విద్య నేర్చుకున్న స్థాయిననుసరించి, శ్రీ చక్ర నవావరణ పూజ నేర్పబడుతుంది.

మొదటి లెవెల్ పూర్తి అయిన తరువాత, గురూజీ నిర్దేశముల ప్రకారం మీరు 3 నెలల పాటు ఉపాసన చేయవలసి ఉంటుంది. మీరు చేసిన ఉపాసన ఆధారంగా,తరువాత రెండవ లెవెల్ కు పంపబడతారు. అక్కడ నుండి రెండు నెలల ఉపాసన తరువాత 3వ లెవెల్, మరి రెండు నెలల ఉపాసన తరువాత 4వ లెవెల్ కు పంపబడతారు. అక్కడ నుండి 5వ లెవెల్ కు వెళ్లటానికి 8 నెలల ఉపాసన పూర్తి చేయవలసి ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి లెవెల్ లో మీ ప్రవేశము అనేది మీ సాధన మరియు గురూజీ నిర్ధారణల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రతి లెవెల్ కు ఫీజు ఉంటుంది. కానీ అడ్వాన్స్ డ్ లెవెల్ కు వచ్చిన తరువాత, ఫీజు కన్నా కూడా మీ సాధన ముఖ్యం అవుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటూ కూడా, సాధన క్రమం తప్పకుండా చేసే వారికి ఫీజు లేకుండా నేర్పటం జరిగింది.

జపము లేదా తర్పణములు చేసేటప్పుడు మధ్యలో విరామము తీసుకునేందుకు వీలు లేదు. ఒక రోజు బ్రేక్ వచ్చినా మరలా ప్రారంభించవలసి ఉంటుంది. స్త్రీలకు మాత్రం ఋతుక్రమం 5 రోజుల తరువాత కొనసాగించవచ్చును.

ఉదాహరణకు కొండ ఎక్కుతున్నామనుకోండి. ఏ ఒక్క మానవ మాత్రునికీ ఒక్క సారిగా ఎగిరి కొండ పైకి చేరుకోవటం సాధ్యం కాదు కదా. కొండ దిగువ భాగం నుండి పైకి ఎక్కటం ప్రారంభించాలి. ఎక్కటానికి బలము, మనో ధైర్యము కావాలి. దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించే ఆత్మ స్థైర్యము అలవరచుకోవాలి.అలాగే, ఎంతో శక్తివంతమైన మంత్రమును ఉపాసన చేసి దాని వల్ల వచ్చే శక్తిని తట్టుకోగలగటం కోసం, ప్రారంభ లెవెల్స్ నో అభ్యాసం చేయవలసి ఉంటుంది. అందువలన మొదటి లెవెల్ నుండి ప్రారంభించి, నెమ్మదిగా వేగమును, శక్తిని, మనో ధైర్యాన్ని పెంచుకోవలసి ఉంటుంది.

ప్రయత్న పూర్వకంగా ఉదయాన్నే ఒక గంట ముందు లేవండి. లేదా, రాత్రి ఒక గంట ఆలస్యంగా పడుకోండి. ఆధ్యాత్మికతలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే, దాని కోసం మీరు శ్రమించాలి. ఉద్యోగంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయటానికి ఏ విధంగా ఎక్కువ సమయం వెచ్చిస్తారో, అలాగే ఇది కూడా చేయవచ్చును.

శ్రీవిద్య పరిచయం

తెలుగులో శ్రీవిద్య బేసిక్ సాధన తరగతుల ప్రివ్యూ

గురువాణి ఆధ్యాత్మిక మాసపత్రిక

గురువాణి ఆధ్యాత్మిక మాసపత్రికను తెలుగు మరియూ ఇంగ్లీషులో ఉచితంగా పొందండి.

ఇంగ్లీష్ మరియు తెలుగు లో చదవండి

శ్రీవిద్య నేర్చుకోవాలనుకుంటున్నారా?

ప్రపంచవ్యాప్తంగా పదిహేను వేల మందికి పైగా శ్రీవిద్య సాధన నేర్చుకొని వాళ్ల జీవితాలు మార్చుకున్నారు. ఆసక్తి గలవారు పేరు నామోదుచేసుకోండి. మీకు సందేహాలుంటే వాట్సాప్ ద్వారా +91 8088256632 సందేశాన్ని పంపించండి.

Register now